తీరం తడి Episode 2: YES

తీరం తడి Episode 1: NO

“ఏంటి ఇక్కడా..?”  ఆశ్చర్యపోయాడు అర్జున్

“అవును ఇక్కడే” నవ్వుతూ చెప్పింది రాశి

“ఇంత ఎండలో.. నడి రోడ్డులో.. నువ్వేమో తెల్లగా లేతగా ఉన్నావ్.. తట్టుకోలేవేమో”

“ఐ కెన్ హ్యాండిల్” మళ్ళీ నవ్వుతూ చెప్పింది రాశి.

“అది కాదు.. చూడు ఎంతమంది ఉన్నారో.. మూడు వైపుల నుండీ.. నీ ఒక్క దాని వల్ల కాదు”

“అవును. వల్ల కాదు అందుకే సన అటు వచ్చే వాళ్ళని హ్యాండిల్ చేస్తది”

“సన చేస్తుంది. బట్ నువ్వు అలా చేసే అమ్మాయిలాగా ఉండవు..”

“ష్.. అబ్బా.. నువ్వు వీడియో తీయి అంతా.. నేను చూసుకుంటా ఇదంతా.. ఐ ఫైండ్ మై హ్యాపీనెస్ హియర్”

ఇంకేం మాట్లాడలేకపోయాడు. నది రోడ్డున, అదీ మిట్ట మధ్యాహ్నం, అదీ కాళేశ్వరం మార్కెట్ ఏరియా లో ఇలా ఇద్దరు క్యూట్, పోష్ అమ్మాయిలు ట్రాఫిక్ పోలీస్ లాగా కంట్రోల్ చేయడం అంటే మామూలు విషయమా..

రాశి ఒకవైపు, సన ఒకవైపు నుంచుని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తున్నారు. వీళ్లకు ఇదేం సామాజిక పిచ్చో అనుకుంటూ అర్జున్ వాళ్ళని కవర్ చేస్తున్నాడు.

రాశికి అర్జున్ పరిచయమై వారం తిరక్కుండానే దగ్గరయ్యాడు.  తాను తీసిన వీడియో ఛానల్ లో ఉంచడానికి పెర్మిషన్ కోసమంటూ తిరిగాడు. రాశి కూడా పెర్మిషన్ ఇవ్వనంటూనే తీసేయమని కూడా చెప్పట్లేదు. ఇలా అందమైన అమ్మాయి వెంట తిరగడానికి ఆ అమ్మాయే అవకాశం ఇస్తుంటే ఏ అబ్బాయినా ఎందుకు తిరగడు. సనకు కూడా అర్జున్ నచ్చాడు. అందుకే ఫ్రెండ్ చేసేసుకుంది. సనకు నచ్చడం వల్ల రాశికి కూడా ఫ్రెండ్ గా నచ్చాడు. అతనిలోని అమాయకత్వం, నిజాయితీ నచ్చింది రాశికి. అన్నిటికన్నా ముఖ్యంగా అతను ఆ వీడియోలో ఉన్న మిగతా అమ్మాయిల అందరి దగ్గరకు వెళ్లి పెర్మిషన్ తెచుకోడానికి పడ్డ పాట్లు నచ్చాయి. అయినా కూడా రాశి చివరకు నో అనే అంది. బహువచనాలు ఏకవచనాలు అయిన కొత్తల్లోనే అర్జున్ అడిగాడు “ఎందుకు నువ్వు ఒప్పుకోవట్లేదు ఆ వీడియో ఉంచడానికి” అని.

“నీకు కంసెంట్ గురించి చెప్పడానికి” అంది.

“నాకు అర్థం అయింది కదా.. అందుకేగా అందర్నీ అడిగి ఒప్పించా.. నిన్ను తప్ప” అన్నాడు.

“ఇంకొకళ్ళు ఉన్నారు”

“ఎవరు?” ఆశ్చర్యపోయాడు.

“ఆ అంకుల్”

“అంకులా.. వాట్ ద ఫ.. ఆ ముసలాడా.. వాడిని అడిగేది ఏంటి.. వాడు ఏమన్నా నష్టపోతాడా అసలు ఈ వీడియో వల్ల నువ్వేదో”

“అవన్నీ కాదు అతన్ని ఒప్పిస్తేనే నేను ఒప్పుకుంటా..”

“రాశి.. వాడు..”

రాశి కోపంగా చూసింది రెస్పెక్ట్ ఇవ్వమన్నట్టుగా

“అతను చేసింది తప్పు..ఈ వీడియో వల్ల ఎప్పటికైనా అతను గిల్ట్ ఫీల్ అవుతాడు.. చేంజ్ అవుతాడు చూడు..”

“ఐ బిలీవ్ ఇన్ చేంజ్. బట్ ఇలా ఒక్క వీడియోకే ఎవరూ మారరు.. అయినా నువ్వు అతన్ని అడిగి పెర్మిషన్ తీసుకోవాల్సిందే..” అని అంది. అంతే ఇంక అర్జున్ ఆ వీడియో మాట ఎత్తలేదు.. కాకపోతే ఇక నుండి రాశి చేసే పనులు వీడియో తీసుకోడానికి పెర్మిషన్ అడిగాడు. వాటికి ఒప్పేసుకుంది. అలా వాళ్ళు వీడియోస్ తీస్తూ దగ్గరవుతున్నారు.. అలా ఇలా ఈ రోడ్ మీదకు చేరారు.

రాశి, సన చెరో వైపు నుంచుని ట్రాఫిక్ ని మ్యానేజ్ చేస్తుంటే అబ్బాయిలు, అంకుల్స్ కళ్ళు వీళ్ళని తడిమేస్తున్నాయి.  పాలకోవాల్లాగా నోరూరిస్తున్నారు.. వెళ్లే వాళ్ళు వెనక్కి తిరిగిమరీ రాశి వెనుకని చూస్తున్నారు. అసలే చుడిదార్ కొద్దిగా టైట్ గా ఉంది కదా.. రాశి పెద్ద విశాలమైన పిరుదుల షేప్ కనిపిస్తుంది. అటు ఇటు పోయే కుర్రాళ్ళు వెక్కి నవ్వులు నవ్వుతూ పోతున్నారు.. అర్జున్ ఇవన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అంతలో ఒకతను రాశి దగ్గరకు వచ్చాడు. అతన్ని చూడగానే అర్జున్ అతన్ని గుర్తు పట్టాడు, రాశి కూడ గుర్తుట్టిందని చూస్తున్న అర్జున్ కి అర్థం అయింది. ఎందుకు మర్చిపోతారు అసలు. అప్పటికే కొన్ని వందల సార్లు అతన్ని వీడియోలో చూశారు వీళ్ళు. ఆ రోజు రాశి హెల్ప్ చేసిన ముసలాయనే ఇతను.

“అమ్మాయ్..” అంటూ దగ్గరకు వచ్చాడు.

అంతే రాశి భయపడి అర్జున్ ని సైగ చేసింది. భయపడింది ఏమన్నా చేస్తాడని కాదు. మళ్ళా బూతు పురాణం ఎత్తుకుంటాడేమో అని. అర్జున్ దగ్గరకి వచ్చాడు. “ఆరోజు తాగినా అమ్మాయ్.. నా పెళ్ళాం బాగా దెంగులు పెట్టింది.. అంత మంచి అమ్మాయిని, పైగా నన్ను కాపాడి సాయం చేసిన అమ్మాయిని ముండ అన్నాను అని. సారీ అమ్మాయి” అంటూ దణ్ణం పెట్టాడు. అంతే రాశికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. “నేను తాగుడు తగ్గించా అమ్మాయ్ చాలా బాధ పడ్డా.. ఆ వీడియో చూసినోళ్లు అంతా నన్ను తిట్టారు.. ఎంత తప్పు చేసానో తెలిసొచ్చింది”

“అయ్యో పర్లేదు అంకుల్” అని అర్జున్ వైపు చూసింది రాశి

చూసావా నేను చెప్పినట్టు మారిపోయాడు అన్నట్టుగా చిన్ని నవ్వు ఇస్తున్నాడు అర్జున్.

“నేను ఏదో తాగి అనేసాను.. తప్పు తెలుసుకున్నాను..కానీ ఆ లంబ్ది కొడుకు వలన నీ పరువు పోతుంది”

“ఎవర్ని అంటున్నారు అంకుల్?”

“అదే పిల్లి లాగా ఎవడో పూగ్గడు వీడియో తేశాడుగా.. ఆ లంబ్ది కొడుకు గురించే” రాశికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మళ్ళా తిరిగి అర్జున్ వైపు చూసింది అయోమయంగా.. అర్జున్ మొఖంలో నెత్తురు చుక్కలేదు. అర్జున్ మొహం చూడగానే రాశికి పొట్టపగిలేల నవ్వొచ్చింది. కానీ అంతా కడుపులోనే దాచుకుని పెదాలు కరుచుకుని నవ్వు ఆపుకుంటూ ముసలాయనతో “ఏం పర్వాలేదు అంకుల్” అంది.

“పర్లేదు కాదమ్మా అలా ఎలా తీస్తాడు లంబ్డికొడుకు అసలు.. అలాంటి ముండా..” అని ఇంకేదో చెప్పబోతుంటే.. రాశి నవ్వు ఇంకా ఎక్కువసేపు ఆపుకోలేదని అర్థం అయ్యి “అంకుల్ అంకుల్ పర్లేదు.. ఏం కాదు మీరు వెళ్ళండి.. మర్చిపోండి ఇదంతా” అంటూ అతన్ని చిన్నగా పంపిచేస్తూ అతను కొంత దూరం వెళ్ళగానే పగలబడి నవ్వింది.

“సరేలే నేను చెప్పినట్టే మారాడుగా అది చాలు” అని కవర్ చేసుకుంటున్నాడు అర్జున్.

“సారి అర్జున్.. బట్ ఐ కాంట్ కంట్రోల్..మై…” అంటూనే నవ్వేస్తుంది.. నువ్వు నవ్వుకో అంటూ..”సన నీ ఫ్రెండ్ ని చూసుకోలేకపోతే నవ్వి నవ్వి ట్రాఫిక్ జామ్ చేసేట్టు ఉంది” అంటూ పక్కకు..ఆ ముసలాయన పోయే వైపు పోయాడు. ఇవేమీ గమనించని సన రాశి ఎందుకు నవ్వుతుందో తెలియక దగ్గరకొచ్చి అడుగుతుంది.

“ఇదిగోండి అంకుల్..” అంటూ అర్జున్ పిలిచాడు..

వెనక్కు తిరిగి..రాశితో వచ్చిన అబ్బాయి అని గుర్తుపట్టి “ఏంటి” అన్నాడు

“అదే.. ఆ వీడియో ఇంటర్నెట్లో ఉండడానికి నీకేం ప్రాబ్లెమ్ లేదు కదా”

“ఏ వీడియో??”

“అదే.. నువ్వు, మా రాశి ఉన్న వీడియో”

“నాకేం ప్రాబ్లెమ్..  ఆ అమ్మాయికే ప్రోబ్లమ్”

“అయితే ఉంచొచ్చా?”

“తీసి దెంగాలి.. ఆ అమ్మాయి ఇబ్బంది పడదూ… అయినా ఆ లంబ్డికొడుకు ఎవడో తీయాలి గా”

“ఆ అమ్మాయి ఒప్పుకుందిలే గాని నీ సంగతి చెప్పు” అసహనంగా అడిగాడు అర్జున్

“అమ్మాయి ఒప్పుకుందా.. ఎవడు అడిగాడు?”

“నేనే”

“అంటే ఆ వీడియో తీసిన లంబ్డి..”

“ఆ..నేనే..” ఇంకా అసహనంగా…

ఆ ముసలాడు అర్జున్ ని, దూరంగా ఉన్న రాశిని చూసి ఏం అనుకున్నాడో ఏమో “సావు” అని వెళ్ళిపోయాడు.

***

“ముసలాడు.. అదే ముసలాయన కూడా ఒప్పుకున్నాడు..సో ఇక వీడియో డిలీట్ చేయను సరేనా” రాత్రి 8 ప్రాంతంలో రాశి కార్ లో అర్జున్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్లే దారిలో అడిగాడు.

“ఆ టైం లో నిన్ను వీడియో తీసి పెట్టాల్సింది నీ వీడియో” అంటూ నవ్వుతుంది రాశీ.

“ఐ కన్సిడర్ థిస్ యాస్ యెస్” అన్నాడు.

“క్యూట్ బాయ్ ఎంబరాస్డ్ ఆన్ విజయవాడ స్ట్రీట్ అని థంబ్ నైల్ పెడితే నా వీడియో వ్యూస్ దాటిపోతాయి”

“నో వే.. నిన్ను దాటలేం”

“ఎందుకేంటి” నవ్వుతూనే అడిగింది రాశి.

“ఎందుకంటే ఆ వీడియోలో నీది ఎంత అందమైన మనసో తెలుస్తుంది. ఇంత అందమైన అమ్మాయిలు అంతే అందమైన మనసు కలిగి ఉండడం రేర్ తెలుసా”

కార్ నడుపుతూనే కళ్ళు అర్జున్ వైపు చూశాయి. నిజమే చెప్తున్నట్టుగా ఉన్నాయి అతని కళ్ళు.

“అందుకే ఇంత డబ్బు వుండి కూడా మిడిల్ క్లాస్ బోయ్ తో ఇంత దగ్గరగా ఉన్నావ్, అదీ నీ పెర్మిషన్ లేకుండా నిన్ను వీడియో తీసిన అబ్బాయితో.. ఎంత బ్యూటిఫుల్ నువ్వు.. నన్ను అర్థం చేసుకున్నావ్.. వేరే ఎవరన్నా అయితే తిట్టేవాళ్ళు, కొట్టేవాళ్ళు.. కానీ నువ్వు నాకు తెలియదు అంటే చెప్పావ్.. అది తప్పు అని తెలిసేలా చెప్పావ్.. అందుకే నువ్వు బ్యూటిఫుల్..”

రాశి సైలెంట్ గా కార్ నడుపుతోంది.. కానీ రాశి ఇదంతా మనసుతో వింటుంది అనడానికి సాక్ష్యంగా కార్ స్లో అవుతోంది.

“ఇప్పుడు చెప్పు నా వీడియో నీ వీడియోని క్రాస్ అవుతుందా?”

చిన్నగా నవ్విన రాశి. “అవుతుంది” అంది.

“ఎందుకు?”

“బికాస్ యు అర్ బ్యూటిఫుల్”

“అబ్బాయిల్ని హ్యాండ్సమ్ అంటారు అండీ” అంటూ నవ్వాడు

“నేర్పే వాళ్ళ కన్నా నేర్చుకునే మనసున్న వాళ్లే బ్యూటిఫుల్” అంది రాశి.

రాశి వైపు తదేకంగా చూస్తూ.. “అయితే నువ్వు కూడా నాలగా బ్యూటిఫుల్ హార్ట్ ని ప్రేమిస్తావా?” అన్నాడు

“వాట్..” చాలా చిన్నగా అంది రాశి. అయోమయంగా అతన్నే చూస్తూ పక్కకు కార్ ఆపింది.

“వాట్ డూ యూ మీన్ అర్జున్?”

“మనం కలిసి 1 మంత్ కూడా కాలేదు..కానీ నాకు నువ్వంత ఎవరూ నచ్చలేదు. అసలు నీలో ఏం చూసినా నచ్చుతుంది. లేక నాకు నచ్చేవి అన్నీ నీలోనే దొరుకుతున్నాయేమో.. ఐ డోంట్ నో..నేనైతే ఇంత షార్ట్ టైం లో ఎవరితోనూ ఇలా క్లోస్ అవ్వలేదు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఇపుడు నాక్కూడా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నీ ఇష్టాలు నా ఇష్టాలు అయిపోయాయి. నీ వరల్డ్ నా వరల్డ్ అనిపిస్తుంది.. నీకేం అనిపించట్లేదా..?”

రాశికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఇదంతా కొత్తగా ఉంది. అంటే తనకు చాలా మందే చాలా రకాలుగా చెప్పారు ఇలాంటివి. కానీ ఇది కొత్తగా ఉంది. మొదటి నుండి రాశికి అర్జున్ నచ్చాడు. సన కూడా మంచిగా చెప్పడం వలన ఇంకా నచ్చాడు. అర్జున్ ని రిజెక్ట్ చేయడానికి కారణాలు ఏమి కనపడలేదు తనకు. అలాగని ఇంత త్వరగా నిర్ణయం తీసుకోడం కరెక్ట్ కాదనిపించింది. అదే చెబుదాం అని అర్జున్ వైపు తిరిగి చీకటి లో అతని మొహం వైపు చూస్తూ చెప్పబోయే లోపు “ఒక్క నెలలో ఆ ముసలాయన మారి నీకు సారీ చెప్పాడు, ఒక్క నెలలో మనిద్దరం క్లోస్ అయ్యాం.. ఒక్క నెలలో నాకు నీమీద చాలా ప్రేమ వచ్చింది. నీకు ఈ నెలలో ఏమీ అవ్వలేదా..? లేక దాస్తున్నవా? నువ్వు నిజంగా నిజం చెప్పు..నాకు కంసెంట్ నేర్పించావుగా.. నేను నిన్ను ఆ విషయంలో దిస్తుర్బ్ చేయను.. జస్ట్ యెస్ ఆర్ నో అంతే..”

రాశికి అతన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అలాగని ఇప్పుడే చెప్పడమూ భయంగా ఉంది. ఊపిరి తీసుకుని అర్జున్ వైపు చూస్తూ..

“చాలా ప్రశ్నలకు ఆన్సర్స్ యెస్ కి నో కి మధ్యలో ఉంటాయి అర్జున్..”

“బట్ డెసిషన్స్ యెస్ ఆర్ నో మధ్యనే ఉంటాయి” తడుముకోకుండా అన్నాడు అర్జున్

అతను అన్నది రాశికి నచ్చలేదు. కానీ అలా అనడం నచ్చింది. చిన్నగా నవ్వి “నీకు చాలా నేర్పాలి.. అందుకే యెస్. నువ్వు చాలా నేర్చుకోవాలి అందుకే నో” అంది

అర్జున్ కి ఇది యెస్ అన్నంత ఆనందమూ.. నో అన్నంత బాధా ఒకేసారి వచ్చాయి.

“తిన్నగా ఒకటి చెప్పొచ్చుగా” అలక ఫేస్ పెట్టాడు.

రాశికి ఇది నచ్చింది. “ఆల్మోస్ట్ యెస్ అనుకో.. కాకపోతే మన టేస్ట్స్ ఒకళ్ళవి ఇంకొకళ్ళకి తెలియాలి ఇంకా..అందుకే మనం ఇంకొంచెం తెలుసుకోవాలి”

“అయితే డేటింగ్ ఆహ్” ఎక్ససిటింగ్ గా అడిగాడు అర్జున్.

“మోర్ దాన్ దట్” నవ్వుతూ అంది. ఆ నవ్వులో ఎన్నెన్నో అర్థాలు వెతుక్కోవచ్చు.

“అయితే టేస్ట్స్ తెలుసుకోవాలి అంటావ్” చిలిపిగా అన్నాడు అర్జున్.

“హ్మ్మ్.. యా”

“కెన్ ఐ టేస్ట్ యువర్ లిప్స్” ఆశగా అడిగాడు

రాశి షాక్ అయ్యింది. వీడు ఇంత ఫాస్ట్ అనుకోలేదు.

“కంసెంట్ అడిగా సినిమాల్లో హీరోల్లాగా కిస్ చేయలేదుగా”

రాశి చిలిపిగా కోపం నటిస్తూ “అంటే కిస్ చేసేద్దాం అనే..”

“మరి ఆల్మోస్ట్ యెస్ అన్నప్పుడు కిస్ అనేది కూడా ఆల్మోస్ట్ యెస్ ఏ గా”

“నో” కొంచెం ఉడికిస్తూ అంది రాసి

“అదేంటి మళ్ళీ” నీరసంగా అన్నాడు అర్జున్

“ఆల్మోస్ట్ యెస్ కి నో. కంప్లీట్ యెస్ కి యెస్” కసిగా చూస్తూ అంది రాశి.

“అంటే..” ఆశ్చర్యంగా అడిగాడు

“యెస్” అంది

నమ్మలేకపోయాడు అర్జున్. రాశి నుండి ఇలాంటి మాట ఊహించలేదు. ఇంత రొమాంటిక్ పర్సన్ ఉందా రాశిలో.. ముద్దుకు యెస్ అని తానే తన నోటితో చెప్తుందా.. తనలో ఇంకా ఏమేమి దాగున్నాయో చూడాలనిపిస్తుంది. ముందు తన పెదాల రుచి చూడాలి.

కార్ లో లైట్ ఆన్ చేసాడు. తనకు అడుగు దూరంలో అందమైన రాశి. ఇప్పుడే యెస్ చెప్పిన తడి పెదాలు మూసి ఉన్నాయి. చిన్నగా నవ్వుతూ ఉన్నాయి. కళ్ళు అతనిని కట్టేసి దగ్గరకు లాగుతున్నాయి. అందుకే ఏమో అడుగు దూరం అంగుళం అయ్యింది. ఒకళ్ళ ఊపిరి ఒకళ్లకు తగులుతుంది. రాశి కళ్ళు మూసుకుంది. అర్జున్ చిన్నగా రాశి నవ్వే పేదలకు తన పెదాలు ఆనించాడు. ఇద్దరిలో ఎవరు తెరిచారో గుర్తులేదు ఐదు నిముషాల తర్వాత ఇద్దరి పెదాలు ఇద్దరి లాలాజలంతో తడిసిపోయాయి. చెంపలు ముక్కు చెవులు కూడా తడి అయ్యాయి.ఆ తడిని పొడుస్తూ కార్ ఏసీ ఇద్దరిని రెచ్చగొడుతుంది. అర్జున్ భుజాలు, వీపు గట్టిదనాన్ని రాశి, రాశి చేతుల, వీపు మెత్తదనల్ని అర్జున్ తడుముతున్నారు. అలా అర్జున్ రాశి మీద కి అలా వెళ్ళగానే.. అర్జున్ మోచేయి తగిలి హారన్ మోగింది. వాళ్ళకది ఇంకాసేపు ఇలానే ఉంటే ఏమేమి అయిపోతాయో అన్నట్టుగా అలారం సౌండ్ లాగా అనిపించింది.  అందుకే విడిపోయారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. ఏసీ ఊపిరి పీల్చుకుంది. “వెళదామా” అంది రాశి.

“సరే” అన్నాడు

“ఇంతకీ టేస్ట్ ఎలా ఉంది?” స్టార్ట్ చేస్తూ అడిగింది

“అలా అడిగితే ఈ సారి అడక్కుండా పెట్టేస్తా”

దారంతా ముసిముసి నవ్వులు.

***************************************

– A story by Rambabu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *