గర్ల్స్ హైస్కూల్ – girls high school 99

 అటు ఉదయ్ కూడా శ్రీదేవిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె వెనకనున్న శంకర్ వైపు వింతగా చూసి, “అమ్మా… ఈ అంకుల్ ఎవరు?” అని అడిగాడు.

శ్రీదేవి తల తిప్పి శంకర్ వైపు చూసింది. శంకర్ అక్కడే వున్నాడన్న సంగతిని ఒక్క క్షణం తను మర్చిపోయింది. తను అలా తిరగ్గానే ఆమె చెంప మీద కమిలిన ఎర్రని గుర్తుని చూసి ఉదయ్, “అమ్మా… ఏంటిది..?” అంటూ అక్కడ చెయ్యి వేసి పామాడు. శ్రీదేవి కాస్త నొప్పిగా అనిపించి వాడి చేతిని పట్టుకొని ఆపి, “కన్నలూ… నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో… నేను కాసేపట్లో వస్తానేఁ..!” అని చెప్పి వాడ్ని క్రిందకి దింపింది. వాడు శంకర్ ని ఆసక్తిగా చూస్తున్నాడు. శ్రీదేవి తన బ్యాగ్ లోంచి ఓ చాక్లెట్ ని తీసి వాడికి ఇచ్చి లక్ష్మమ్మతో వాడ్ని లోపలికి తీసుకెళ్ళమని చెప్పింది.
శంకర్ కి అంతా గజిబిజిగా వుంది. శ్రీదేవి తన ప్రియుడ్ని కలవటానికి వస్తోందని అనుకున్నాడు. కానీ, తను ఇక్కడ ఏకంగా ఓ పిల్లాడ్ని కనేసి రహస్యంగా పెంచుతోంది.! ‘ఆరేళ్ళ పిల్లాడు…!?! ఇంకా ఏం నిరూపించాలని తనని ఇక్కడకి తీసుకొచ్చింది…?’
ఉదయ్ లోపలికి వెళ్ళిపోగానే శ్రీదేవి శంకర్ తో, “ఏఁవండీ…! ఉదయ్… నా సొంత బిడ్డ కాదు… నా అక్క కొడుకు,” అంది శంకర్ మనసులో ప్రశ్నకు జవాబుగా.
“ఏంటీ-? న్-నీకో అక్క కూడా వుందా?” అన్నాడు శంకర్ ఆశ్చర్యపోతూ.
“ఊ…. ఇప్పుడు లేదు!”
“నాకేం అర్ధం కావటంలేదు…! పెళ్ళి సంబంధం కుదుర్చుకునేప్పుడు మీ అమ్మ తనకి నువ్వొక్కత్తివే సంతానమని చెప్పిందిగా..! మళ్ళా ఈ అక్క ఎక్కడ్నుంచి వచ్చిందీ?” అని అడిగాడు వెంటనే…
“ఔనండీ… మా అమ్మకి నేనొక్కదాన్నే సంతానం. అఁ-“
“ఒసేయ్…. పిచ్చెక్కించేస్తున్నావ్ కదే! మీ అమ్మకు నువ్వు ఒక్కదానివే అంటున్నావ్… మళ్ళా నీకో అక్క వుందని అంటున్నావ్….(అంటూ గట్టిగా పళ్ళు బిగించి) అసలేంటిదంతా….? సరిగ్గా చెప్పవేఁ..” అన్నాడు శంకర్.
శ్రీదేవి ఓసారి గాఢంగా వూపిరి పీల్చుకొని, “చెప్తానండీ…. అంతా చెప్తాను…. ముందు మీరు కూర్చోండి…!” అంది.
శంకర్ శ్రీదేవి వంక అసహనంగా చూస్తూ మళ్ళా కుర్చీలో కూర్చున్నాడు.
శ్రీదేవి అలాగే నిలబడి చేతులు కట్టుకుని చెప్పడం ప్రారంభించింది.
“మా అమ్మ, మా నాన్నగారికి రెండో భార్య…. మొదటి భార్య మా అక్కకి జన్మనిస్తూ చనిపోయింది. అక్కయ్య పేరు సరస్వతి. నాన్న అక్కను ప్రేమగా చూసుకుంటుందని అమ్మను పెళ్ళిచేసుకున్నాడు.
కానీ, తను అక్క పట్ల సవతి తల్లి ప్రేమనే చూపించింది. నాకు మాత్రం చిన్నప్పటినుంచీ అక్కంటే ప్రాణం. ఎప్పుడూ అక్కతోనే ఆడుకునేదాన్ని. తను కూడా నన్ను అక్కలా కాకుండా మరో అమ్మలా చూసుకునేది. నాపై ఎంతో ప్రేమని కురిపించేది. అమ్మ అక్కకి పదో తరగతితో చదువును ఆపించడానికి చూస్తే నేనే పట్టుబట్టి తను చదువును కొనసాగించేలా చేశాను. తను స్వతహాగా మెరిట్ స్టూడెంటు కావటంచేత స్కాలర్‌షిప్పులు కూడా తనకి వచ్చేవి. దాంతో, తను మాకు దూరంగా పట్నంలో కాలేజీ హాస్టల్ లో ఉండి చదువుకునేది.
అలా తను ఇంజనీరింగ్ చదివేప్పుడు తన క్లాస్ మేట్ ఒకతన్ని ప్రేమించింది. అతను తక్కువ కులానికి చెందినవాడు. పైగా అనాధ. వాళ్ళ ప్రేమ సంగతి తెలుసుకున్న అమ్మ దాన్ని ఓ అవకాశంగా వుపయోగించుకుని నానా రాద్ధాంతం చేసి అక్కని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది. అమ్మ నోటికి జడిసి నాన్న కూడా ఏం చేయలేకపోయారు. అయితే, ఆ అబ్బాయి చాలా మంచివాడు. పట్నంలో ఉద్యోగం సంపాదించి అక్కను పెళ్ళి చేసుకుని అక్కడే కాపురం పెట్టాడు. నేను అమ్మకి తెలీకుండా అప్పుడప్పుడు వెళ్ళి అక్కా బావల్ని కలిసి వస్తుండేదాన్ని. వాళ్ళ సంసారం చూడ ముచ్చటగా వుండేది. అలా అంతా సంతోషంగా గడిచిపోతుండగా ఆరు సంవత్సరాల క్రితం వారి జీవితాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. బావ రోడ్డు యాక్సిడెంటులో చనిపోయారు. దాంతో, అక్క చాలా కృంగిపోయింది. అప్పటికే తను నిండు గర్భిణి. అక్కను సముదాయించటానికి నేను ఎంతో ప్రయత్నించాను. కానీ, తను ఆ బాధనుంచి తేరుకోలేకపోయింది. ఆ ప్రభావం తన కాన్పు పై పడింది. చివరికి ఉదయ్ కి జన్మనిచ్చి వాడ్ని నా చేతుల్లో పెడుతూ తను… కన్నుమూసింది. ‘శ్రీదేవీ…. నా బాబుని అనాధను కానివ్వకు… ఇకనుంచి నువ్వే వాడికి తల్లివి కావాలి… వీడు మా ప్రేమకు ప్రతిరూపం…’ అంటూ తను నాకు చెప్పిన చివరి మాటలు నా చెవుల్లో ఇంకా మార్మోగుతూనేవున్నాయి…
అయితే, ఉదయ్ ని మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటే అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు. “ఈ దరిద్రాన్ని ఎందుకే ఇంటికి తీసుకొచ్చావ్… మనకు కూడా వీడివల్ల శని చుట్టుకోవటానికా… పుట్టకుండానే తండ్రిని, పుట్టిన వెంటనే తల్లినీ మ్రింగేశాడు వెధవ… వీడు ఈ ఇంట్లో వుండటానికి వీల్లేదు. తీసుకెళ్ళి అనాధ శరణాలయంలో తగలెయ్..!” అంటూ నాపై తీవ్రంగా అరిచేసింది. తను చెప్పింది చెయ్యకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఎమోషనల్ గా బ్లాక్మైల్ చేయడంతో అమ్మకు తెలీకుండా మా దూరపు బంధువైన ఈ లక్ష్మమ్మ సాయంతో ఉదయ్ ని ఇక్కడ రహస్యంగా ఈ ఇంట్లో వుంచాను. ప్రతీ నెలా వెళ్ళి వాడ్ని చూసి వాళ్ళకు కావలసినవి అన్నీ సమకూర్చి వస్తూండేదాన్ని.
మీతో పెళ్ళి కుదిరినప్పుడు మిమ్మల్ని కలిసి ఉదయ్ గురించి మీకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ, మన పెళ్ళయ్యేంతవరకూ మీతో పర్సనల్ గా మాట్లాడేందుకు మా అమ్మ వీలు కల్పించలేదు. పోనీ, మొదటిరాత్రి మీతో చెప్దామని అనుకుంటే – ‘మూడేళ్ళవరకూ మనకు పిల్లపీచూ ఎవరూ వద్దు. నువ్వూ, నేనూ హేపీగా ఎంజాయ్ చేద్దాం’ అన్నారు మీరు. నాకు మీ గురించి ఏమీ తెలీదు. ఇక ఆ సమయంలో ఉదయ్ గురించి చెప్తే మీరు కూడా మా అమ్మలాగనే స్పందించి వీడ్ని ఓ పాపంగా భావిస్తారేమోనని భయపడి అప్పటికి నా ప్రయత్నాన్ని వాయిదా వేశాను. మీ మూడ్ మంచిగా ఉన్నప్పుడు మెల్లగా చెపుదామని వేచివున్నాను… కానీ, ఈ పరిస్థితులలో చెప్పాల్సి వస్తుందని నేననుకోలేదు!” అంటూ చెప్పడం ఆపి ఓసారి శంకర్ వైపు చూసింది. శంకర్ తల దించుకుని వున్నాడు. ఆమె కొనసాగిస్తూ, “మీతో ఇదంతా ముందుగా చెప్పకపోవటం నిజంగా నా తప్పే… దయచేసి నన్ను క్షమించండి…” అంది. ఆమె కళ్ళలోంచి నీరు చెంపలపైకి చేరింది. తల దించుకుని అతని ఎదుట మౌనంగా నిల్చుంది.

శంకర్ ఇంకా తలదించుకునే వున్నాడు. రెండు యుగాల(క్షణాల) మౌనం తర్వాత…
“ఔను… నువ్వు తప్పు చేశావ్…!” అన్నాడు మెల్లగా. శ్రీదేవి చప్పున తలెత్తి శంకర్ వైపు చూసింది. శంకర్ కూడా మెల్లగా తల ఎత్తి ఆమె వంక చూసి చిన్నగా నవ్వుతూ, “నిజంగా ఈ విషయాన్ని దాచి చాలా పెద్ద తప్పే చేశావ్, శ్రీదేవి…! ఏఁ…. నేను మరీ అంతటి కఠినాత్ముడను అనుకున్నావా….?” అన్నాడు. శ్రీదేవికి ఒక్కసారిగా సంతోషం పెల్లుబికింది. అనిర్వచనీయమైన ఆనందంతో మనసు తుల్లింతకు గురవుతుండగా శంకర్ పాదాల మీద పడబోయింది. శంకర్ ఆమెను మధ్యలోనే ఆపి కుర్చీలోంచి లేచి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు.
శ్రీదేవి చెప్పింది విన్నాక. అతని హృదయం బరువెక్కింది. మనసులో తన భార్య యెడల మిక్కిలి గౌరవం ఏర్పడింది. ఆమె గురించి తప్పుగా అనుకున్నందుకు తనపై తనకే ఎంతో అసహ్యం వేసింది.
‘నిజానికి తప్పు నీది కాదు శ్రీదేవి…. అగ్ని సాక్షిగా పెండ్లాడిన నీకు ద్రోహం చేస్తూ, వైవాహిక బంధానికి వున్న పవిత్రతను మంటగలుపుతూ పరస్త్రీలతో అక్రమ సంబంధాలు సాగించి ‘నేను’ తప్పు చేశాను… కాదు పాపం చేశాను…’ అని మనసులో అనుకున్నాడు.
శంకర్ ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్ళను తుడిచాడు. ఆమె అతని కౌగిలిలో వెచ్చగా కరిగిపోయింది.
అప్పుడే శంకర్ కి ఏదో గుర్తుకొచ్చింది. జేబులోంచి ఫోన్ తీసి అజయ్ కి కాల్ చేశాడు.
“హలో అజయ్… కేసు పెట్టడానికి నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు చెప్పింది నిజం. శ్రీదేవి విషయంలో నేను చాలా తప్పుగా అనుకున్నాను. తనే పాపమూ యెరుగదు… తనకి ఎలాగైనా న్యాయం జరగాలి… తప్పు చేసినవాళ్ళకి శిక్ష పడాలి…”
“బెదరూ… చాలా మంచి నిర్ణయం తీసుకున్నావ్… నాకు చాలా సంతోషంగా వుంది. మొత్తానికీ నువ్వు రియలైజ్ అయ్యావ్… ఇక మిగతా విషయాలు నాకు వదిలేయ్…! ఇవాళ సాయంత్రమే వచ్చి శ్రీదేవిగారి దగ్గర స్టెట్‌మెంట్ తీసుకుంటాను. సరేనా…. ఆనా కొడుక్కి సరైన శిక్ష పడేవరకూ వదిలేది లేదు…” అంటూ ఫోన్ పెట్టేశాడు.
నిజానికి శంకర్ కేసు పెట్టడానికి ఒప్పుకోక ముందే ఆ దుర్గాదాస్ గురించి ఎంక్వయిరీలు మొదలెట్టాడు అజయ్. అప్పుడే అజయ్ కి దుర్గాదాస్ తలపగిలి హాస్పిటల్లో వున్నాడని తెలిసింది. విషయం ఏంటా అని ఆరా తీస్తే వాడి పనివాళ్ళే వాడిపై దాడి చేయటం, పోలీసులకు కబురు పెట్టడం తదితర విషయాలన్నీ బయటపడ్డాయి. అయితే, వాడి మీద ఎఫ్.ఐ.ఆర్ ఫైలయిందా..? అనే మేటర్ తెలుసుకునేందుకు ఆ డివిజన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే, ఆ సదరు ఎస్సై, “ఆ పనివాళ్ళు కేసును విరమించుకున్నారు సార్…!” అని చావుకబురు చల్లగా చెప్పాడు. కారణం ఏంటని అడిగితే వెకిలిగా నవ్వుతూ, “మీకు తెలీందేముంది సార్… పెద్దోళ్ళ గొడవలు..! ఆ పనివాళ్ళ మొగుళ్ళని విడిచిపెట్టడానికి దుర్గాదాస్ గారు ఒప్పుకున్నారు. దాంతో, వాళ్ళు కేసును విరమించుకున్నారు… పైగా ఒక్కొక్కరికీ రెండు లక్షలు చొప్పున పరిహారం కూడా ఇచ్చేందుకు ఒప్పుకున్నారాయన… అందుకే-” అని ఇంకా ఏదో చెప్తుండగా అజయ్, ” వాడి దగ్గర మీరు చెరో రెండు లకారాలు పుచ్చుకుని కేసు క్లోజ్ చేసేశారు… అంతేగా!” అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాడు.
‘ఇప్పుడేం చెయ్యడం?’ అని అనుకుంటున్న తరుణంలో శంకర్ ఫోన్ తో అజయ్ లో మళ్ళా ఉత్సాహం ఉరకలెత్తింది. “రేయ్ దుర్గాదాస్… ఇక నువ్వు మటాష్ రా…!” అనుకుంటూ బల్లను గట్టిగా చరుస్తూ నవ్వాడు.

★★★

అజయ్ తో మాట్లాడాక శంకర్ శ్రీదేవితో కలిసి లోపలి గదికి వెళ్ళి అక్కడ లక్ష్మమ్మతో ఆడుకుంటున్న ఉదయ్ ని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. “ఏంటి అంకుల్…?” అంటూ ఉదయ్ గెంతుకుంటూ వాళ్ళని సమీపించగానే శంకర్ వాణ్ణి ఎత్తుకుని, “అంకుల్ కాదు… ‘నాన్నా’ అని పిలువు నన్ను,” అన్నాడు వాడి బుగ్గను ముద్దాడుతూ. “నాన్నా…?” అంటూ ఆశ్చర్యంగా శ్రీదేవి వంక చూశాడు ఉదయ్. శ్రీదేవి మునివేళ్ళతో వాడి జుట్టును దువ్వినట్టుగా చేస్తూ, “ఔను… కన్నా!” అంది విప్పారిన వదనంతో. శంకర్ ఆమె చుట్టూ ఓ చేతిని వేసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. శ్రీదేవి శంకర్ భుజంపై తలవాల్చి, “థాంక్స్!” అంది మెల్లగా.
శంకర్, “ఐ లవ్ యూ… డియర్!” అన్నాడు ఆమె చెవిని ముద్దాడుతూ.
“అమ్మా…. నాన్నా…!” అంటూ ఉదయ్ కేరింతలు కొట్టాడు.
“పదండి… ఇక మన ఇంటికి వెళదాం!” అన్నాడు శంకర్ నవ్వుతూ.

★★★

ఆరోజు సాయంత్రం అజయ్ అమలాపురం వెళ్ళి శ్రీదేవి దగ్గర స్టేటుమెంట్ తీసుకున్నాడు. తర్వాత స్టేషనులో ఎఫ్.ఐ.ఆర్ ఫైల్ చేయించి అట్నుంచి అటే జ్యూడిషియల్ మేజిస్ట్రేటు కోర్టులో సెక్షన్ 64 కింద కేసును దాఖలు చేశాడు.
కేసును పరిశీలించిన జడ్జిగారు – 363, 366, 373 మరియు 506 సెక్షన్ల క్రింద దుర్గాదాస్ పైన అలాగే గిరీశం పైనా కేసులు నమోదు చేసి నలభై ఎనిమిది గంటల్లోగా వారిని అరెస్టు చేసి కోర్డులో హాజరుపరచాలని వారెంటుని జారీ చేశారు.
మధ్యలో ఎటువంటి లుకలుకలు జరగకుండా అజయ్ ముందే పక్కాగా అంతా ప్లాన్ చేసి నాన్-బెయిలెబుల్ వారెంటు జారీ చేయించడంతో వారు తప్పించుకునేందుకు వీలు లేకపోయింది.
ఆ కేసు అప్పగించబడిన ఆఫీసర్ ఏ.ఎస్.ఐ కమల్ క్రిష్ణ వారిద్దరినీ అరెస్టు చేసి రెండ్రోజులోనే కోర్టులో ప్రవేశపెట్టాడు. తదుపరి విచారణ జరిగేముందు వాళ్ళని పధ్నాలుగు రోజులకు రిమాండుకు తరలించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశాడు.

గిరీశాన్ని జైల్లో పెట్టారని తెలిసి అంజలి ఏదో కొంచెం బాధపడింది. తను ముందునుంచి గిరీశం విషయంలో అంత సీరియస్‌గా లేదుగా. ఇక సుజాత అయితే చాలానే బాధ పడింది. ఎంత నేరం చేసినా అతను ‘తన తండ్రి’ కదా… పైగా చేసిందంతా ఆ దుర్గాదాస్ అయితే తన తండ్రి పై కూడా కేసు ఎందుకు పెట్టారని శ్రీదేవి, శంకర్ ల మీద కోపంతో అరిచేసింది కూడా. అయితే, నేరం చేసినవాడికే కాదు, సహకరించినవాడికి కూడా శిక్ష పడుతుందని తనకు తెలీంది కాదు. తనే మెల్లగా సర్దుకుంటుంది అని వాళ్ళు ఆమెను ఏమీ అనలేదు.
రిమాండు గడువు గడిచాక జడ్జిగారు కేసుకు సంబంధించిన కీలకమైన సాక్ష్యాలను విని పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించాక దుర్గాదాస్ కి తొమ్మిదేళ్ళ కఠిన కారాగారవాసాన్ని, అతనికి పరోక్షంగా సహకరించినందుకు గానూ గిరీశానికి రెండేళ్ళ జైలు శిక్షను విధిస్తున్నట్టుగా తీర్పునిచ్చారు.
కేసు పక్కదారి పట్టకుండా తీర్పు త్వరగా వెలువడేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నందుకుగానూ ఇన్సపెక్టర్ అజయ్ ని ప్రత్యేకంగా అభినందించాడు జడ్జి. శంకర్ కూడా అజయ్ కి కృతజ్ఞతలు తెలిపాడు.
తన తండ్రికి రెండేళ్ళు జైలు శిక్ష పడటం సుజాత మనసుని కలచివేసింది. తనకి శంకర్, శ్రీదేవిలపై కోపం తగ్గిందిగానీ, పూర్తిగా మానిపోలేదు. తనకీ తెలుసు, తన కోపం అర్ధరహితం అని… కానీ, దాన్ని మాపడానికి తను మాత్రం ఏ ప్రయత్నమూ చేయడం లేదు. వాళ్ళతో ఎప్పుడూ ముభావంగానే వుంటుంది.
ఇక ఈ మొత్తం వ్యవహారం వలన బాగా నష్టపోయింది మాత్రం అంజలి అని చెప్పుకోవచ్చు. తను అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ఆ శ్రీదేవికి అలా జరిగిందని శంకర్ మనసులో బలంగా నమ్మాడు. అందుకే, ఇకమీదట అలాంటి పనులకు దూరంగా వుండాలని నిశ్చయించుకున్నాడు. శ్రీదేవి కూడా అతనిపై ఇంతకుముందు కన్నా ఎక్కువగా ప్రేమను కురిపించడంతో వారిరువురికీ ప్రతీరాత్రి వసంత రాత్రే అయ్యింది. దాంతో, కట్టుకున్నవాడు లేక ఉంచుకున్నవాడు రాక ప్రస్తుతం అంజలి బ్రతుకు రెంటికీ చెడ్డ రేవడిలా అయ్యింది.

ఇక్కడితో గర్ల్స్ హైస్కూల్ రెండవ భాగం సమాప్తం[

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *